epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు

భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు
వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లకు కోర్టు గ్రీన్ సిగ్నల్
నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలి
పేదలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఆపాలి
భూదాన భూములపై కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
కోర్టు ఆదేశాలను విస్మరిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు
రాజ్యాంగం ప్రకారం పేదలకు న్యాయం చేయాలి
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్

కాకతీయ, ఖమ్మం : కోర్టు ఆదేశాల మేరకే ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదలు ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకున్నారని, వారికి వెంటనే నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2014లో వెలుగుమట్లలోని భూదాన భూమిని పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అక్కడ కనీస వసతులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పోలీసులు జోక్యం చేసుకోవ‌డం మానుకోవాలి

భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పోలీసుల జోక్యం పూర్తిగా నిలిపివేయాలని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి అధికారిక సంస్థ బాధ్యత అని, వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదాన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేదలను అక్కడి నుంచి తొలగిస్తే ఆ భూములను ఆక్రమించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవు

భూదాన భూములను అమ్మే హక్కు గానీ, కొనుగోలు చేసే హక్కు గానీ ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పేదలను వేధిస్తే సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెలుగుమట్ల భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో భారత–చైనా మిత్రమండలి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి డి. విజయేందర్, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు భద్రు నాయక్, బిసి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు రాంబాబు, యర్రా బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.