epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్ – 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ ఆందోళనలు

బాల్క సుమన్ అరెస్టుతో మంచిర్యాలలో బంద్
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు
మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేకు రిమాండ్
14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
ఆదిలాబాద్ జైలుకు తరలింపు… భారీగా పోలీసుల మోహరింపు
అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

కాకతీయ, మంచిర్యాల : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలో గురువారం బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై బాల్క సుమన్‌తో పాటు పలువురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో బాల్క సుమన్ (ఏ–ఒకటి), మూల రాజిరెడ్డి (ఏ–రెండు), దోమకొండ అనీల్ (ఏ–నాలుగు), మామిడి లక్ష్మీకాంత్ (ఏ–ఎనిమిది)లకు మంచిర్యాల కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ గడువు మార్చి మూడు వరకు కొనసాగనుంది. పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదికలో బాల్క సుమన్‌పై మొత్తం 11 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. బీఆర్ఎస్వీ నాయకులు విద్యార్థులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు. పలు చోట్ల పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు, ముఖ్య ప్రాంతాల్లో పహారా నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.బాల్క సుమన్ అరెస్టు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీయగా, ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు అరెస్టును అక్రమమని ఆరోపిస్తూ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్‌ రూ.20...

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,...

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర...

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కాకతీయ,...

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్య‌క్షుడు  వోడ్నాల కాకతీయ, రామకృష్ణాపూర్...

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ అక్రమ కేసులు...

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు రహదారి...

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం బెల్లంపల్లి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.