epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో
బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు
కేసులపై సీఐడీ విచారణకు డిమాండ్

కాక‌తీయ‌, హుజూరాబాద్ : హుజూరాబాద్ గడ్డపై బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఐదు మండలాలకు చెందిన 98 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజం లేదని, అధికారులను దూషించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టలేదని, వ్యాపారులు, ఇసుక క్వారీ యజమానులను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడిన కారణంగా బాధితులే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జీర్ణించుకోలేక కౌశిక్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

సీఎంపై వ్యాఖ్యలు సహించం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వొడితల ప్రణవ్ హెచ్చరించారు. పెద్ద నాయకులతో పోల్చుకుంటే పెద్దవాడినవుతానని కౌశిక్ రెడ్డి పగటి కలలు కంటున్నారని విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ నాయకులపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. వీణవంక సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విధులు నిర్వహించారని తెలిపారు. మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామని విమర్శించారు. మతం పేరుతో కరీంనగర్ సీపీపై దూషణలు చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించిన ప్రణవ్ ఈ అంశంపై బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీ చైర్మన్లు, మండల, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.