epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను
రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్ అంకిత్
మణుగూరులో ప్రభుత్వ సంస్థల్లో సుడిగాలి తనిఖీలు
ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన

కాకతీయ, కొత్తగూడెం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల, గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ముందుగా మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వార్డులు, ఔషధ నిల్వ గది, ఔట్‌పేషంట్ విభాగం, మందుల సరఫరా విధానం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాలను పరిశీలించి ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను, విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, హాజరు వివరాలు, వంటగది, నిల్వ గది, త్రాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం పోషకాహారం సమయానికి అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.