epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత
యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్ కావాలి
మహిళలకు బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ముందు
మహిళలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పిస్తున్నాం
అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
“స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాకతీయ, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతోనే మన బాధ్యత పూర్తికాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళల గౌరవం, భద్రతను కాపాడటం సమాజం మొత్తం బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. “స్టాండ్ విత్ హర్” కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మహిళల భద్రత, సాధికారతపై ప్రభుత్వ దృక్పథాన్ని వివరించారు. దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళను మనం శక్తితో పోలుస్తామని, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్ట్రానికైనా గౌరవం ఉండదని ఆయన అన్నారు. గతంలో మహిళలపై వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవని, కానీ ఇప్పుడు సాంకేతిక అభివృద్ధితో సోషల్ మీడియాలో కూడా వేధింపులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.

సామాజిక బాధ్యతగా చూడాలి..!

మహిళల రక్షణ కోసం చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం మాత్రమే సరిపోదని ముఖ్యమంత్రి అన్నారు. సమాజం మొత్తం బాధ్యతగా భావించి ముందుకు వస్తేనే మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టగలమని చెప్పారు. మన ఇంటి ఆడబిడ్డలకు ఎలాంటి గౌరవం ఇస్తామో, సమాజంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను కూడా అదే గౌరవంతో చూడాలని ఆయన సూచించారు. ప్రతి యువకుడు మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతోనే అందిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిల్పారామం వద్ద దుకాణ సముదాయాలు కేటాయించి మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ మహిళలు పెద్ద పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమం కూడా చేపట్టామని తెలిపారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా మహిళా శక్తికి గౌరవం తెలిపామని చెప్పారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణను మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో “స్టాండ్ విత్ హర్” కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. సోషల్ మీడియా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, మహిళలపై అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ “స్టాండ్ విత్ హర్” అంటూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.