epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట

గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు

జ‌గిత్యాల జిల్లాలో 590 మంది మహిళలకు మొదటి విడతలో లబ్ధి

మిగిలినవారికి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అవకాశం

ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

కాక‌తీయ‌, జ‌గిత్యాల : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో కుట్టు మిషన్ల కోసం 590 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని మొదటి విడతలో వారికి మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన వారికి కూడా 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా అందజేస్తామని పేర్కొన్నారు. మైనార్టీ రుణాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖలతో చర్చించి రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండ

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 15 మంది కుటుంబాలకు రూ.75 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 250 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.