epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!
పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం
బాధితుల బాధను రాజకీయ ఎగ్జిబిషన్ చేశారు
ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు స్పందించాలి
పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తాం
ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టివ్వాలి
తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత
వెలుగుమట్ల బాధితులకు ప‌రామ‌ర్శ

కాకతీయ, ఖమ్మం బ్యూరో : వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇళ్లను కోల్పోయి రోడ్డున పడిన ఆడబిడ్డల కన్నీళ్లు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తగులుతాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చివేయడం అమానుషమని కవిత మండిపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న సమయంలో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని అన్నారు. ఈ ఘటన పేదలపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బాధితుల ఆవేదనను కొన్ని రాజకీయ పార్టీలు ఎగ్జిబిషన్‌లా చూస్తూ వెళ్లిపోయాయని కవిత విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా రాజకీయ లాభాల కోసం మాత్రమే కొందరు నాయకులు అక్కడికి వచ్చారని అన్నారు. బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కేవలం పరామర్శించడానికి మాత్రమే రాలేదని, బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి సంస్థ కూడా బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు

బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లమంటే వెళ్లబోమని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్‌ను గౌరవించాలని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితులను పరామర్శించలేదని ఆమె విమర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు అక్కడికి రాకపోవడం దారుణమని అన్నారు. ముందుగా కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుస్తున్నాయని, కానీ పెద్దల అక్రమ భవనాలపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కవిత ఆరోపించారు. పేదల హక్కులను కాపాడేందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.