epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..!

త‌నిఖీల‌న్నీ ఉత్త గ్యాస్‌..!
క‌రీంన‌గ‌ర్‌లో య‌థేచ్ఛ‌గా డొమెస్టిక్ దందా
వ్యాపారాల‌కు మ‌ళ్లుతున్న గృహ గ్యాస్ క‌నెక్ష‌న్‌ సిలిండ‌ర్లు
5 వేల హోటళ్లకు 2,717 క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ల‌ కనెక్షన్లు
డొమెస్టిక్ సిలిండర్లతోనే దాదాపుగా హోటల్ వ్యాపారం
ఈకేవైసీ అమల్లో గ్యాస్ ఏజెన్సీల నిర్ల‌క్ష్యం..
ఏజెన్సీల ప‌నితీరును ప‌రిశీలించ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు
తూతూ మంత్రంగా త‌నిఖీలు.. రికార్డుల వెరిఫికేష‌న్‌
మాములుగానే వ‌దిలేస్తున్న అధికారులు..

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల లెక్కలు, వాస్తవ వినియోగం మధ్య భారీ వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. అధికారిక గణాంకాలు ఒకలా ఉండగా, నేలమీద పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ వ్యాపార అవసరాలకు మళ్లుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,69,101 గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ అందులో 4,66,384 డొమెస్టిక్ కనెక్షన్లే ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు కేవలం 2,717 మాత్రమే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో జిల్లాలో 5,000కు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, దాబాలు, హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం వేలాది వ్యాపార సంస్థలు కమర్షియల్ గ్యాస్ లేకుండానే నడుస్తున్నట్లు అర్థమవుతోంది.

గ్యాస్ క‌నెక్ష‌న్ల‌లో కాకి లెక్క‌లు..!

జిల్లాలో 7,000 వరకు ఆహార వ్యాపార కేంద్రాలు ఉన్నట్లు అంచనా. కానీ కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు మాత్రం 2,717 మాత్రమే. మిగతా వేలాది హోటళ్లు ఏ గ్యాస్‌తో నడుస్తున్నాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఇదే పరిస్థితి డొమెస్టిక్ గ్యాస్ దుర్వినియోగాన్ని బహిర్గతం చేస్తోంది. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు ప్రాంతాల్లో విస్తృతంగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం కొనసాగుతున్నట్లు సమాచారం. ట్రేడ్ లైసెన్సులు ఉన్న సంస్థలకే కమర్షియల్ కనెక్షన్లు లేకపోవడం వ్యవస్థలోని లోపాలను చూపిస్తోంది. జిల్లాలో 23 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. హెచ్పీసీఎల్ 9, ఐవోసీఎల్ 6, బీపీసీఎల్ 8 ఉన్నాయి. కానీ కనెక్షన్ల జారీ, వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా కష్టమైనా జిల్లాలో ఫుడ్ వ్యాపారం పెద్దగా దెబ్బతినకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అంటే డొమెస్టిక్ గ్యాస్ వినియోగమే ఈ వ్యాపారాలకు ఆధారమైందన్న మాట.

గ్యాస్ దుర్వినియోగానికి కారణాలు..!

డొమెస్టిక్ సిలిండర్ ధర సబ్సిడీతో తక్కువగా ఉండటం, కమర్షియల్ సిలిండర్ ధర ఎక్కువగా ఉండటం దుర్వినియోగానికి ప్రధాన కారణంగా మారింది. తక్కువ ధరలో లభించే గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు మళ్లించడం ద్వారా కొందరు అక్రమ లాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సీఎస్ఆర్ కింద 27,454 కనెక్షన్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ అవి ఎవరికి చేరాయి, ఎక్కడ వినియోగంలో ఉన్నాయి అన్న విషయంపై స్పష్టత లేదు. ఇదే అంశం వ్యవస్థ పారదర్శకతపై సందేహాలు పెంచుతోంది.
ఈకేవైసీ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కాలేదని సమాచారం. సగానికి పైగా కనెక్షన్లు ఇంకా ధృవీకరణలో లేవు. అయినప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది కొనసాగితే సబ్సిడీ గ్యాస్ మరింత దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది. అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ అందకపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్ర‌స్తుత పరిస్థితులపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్యాస్ పంపిణీ వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కలెక్టర్ స్థాయిలో జోక్యం చేసుకుని ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో గ్యాస్ వినియోగ వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయి. లెక్కలు ఒకలా, వాస్తవం మరోలా ఉండటం అధికార యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ దందా మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.