epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త్రినేత్రంగా సీసీ కెమెరాలు

త్రినేత్రంగా సీసీ కెమెరాలు
సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర
నేరాల క‌ట్ట‌డిలో.. చేధ‌న‌లో ఎంతో ఉప‌యుక్తం
కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతం
సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్

కాకతీయ, చేర్యాల : సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ తెలిపారు. నేరాల నివారణ, కేసుల ఛేదనలో ఇవి పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. గురువారం చేర్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి, కాలనీలు, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ ఆధునిక కాలంలో నేరాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరమని అన్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగితే పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. కెమెరాల ద్వారా నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు. ప్రతి వీధిలో కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరస్తులు ముందుగానే వెనుకడుగు వేస్తారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు కేవలం కేసుల పరిష్కారానికి మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించడంలో కూడా కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో, అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందని సూచించారు.

ప్రతి ప్రాంతంలో కెమెరాలు అవసరం

ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, మార్కెట్ ప్రాంతాలు, బిజీ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరమని సీపీ తెలిపారు. గ్రామాల్లో కూడా ఈ అవగాహన పెరగాలని, స్థానిక నాయకులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కెమెరాల ఏర్పాటులో సహకరించిన వ్యాపార సంఘాల నాయకులను సీపీ అభినందించారు. వారి సేవలను గుర్తించి సన్మానించారు. కార్యక్రమంలో సీఐ రమేష్ నాయక్, చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి, మద్దూర్ ఎస్సై ఆసిఫ్, కొమురవెల్లి ఎస్సై మహేష్ తదితరులు పాల్గొన్నారు. తరువాత చేర్యాల పరిధిలోని ఆకునూరు రహదారి పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఖాళీ స్థలాన్ని సీపీ పరిశీలించారు. రెండు ఎకరాల స్థలాన్ని పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆ స్థలాన్ని పోలీస్ గ్రౌండ్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.