epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆర్టీఏలో రేడియం స్టిక్కర్ రగడ

ఆర్టీఏలో రేడియం స్టిక్కర్ రగడ
ఫిట్నెస్ టెస్టులో వాహనదారులపై ఫీజుల భారం
అద‌నుగా దోపిడీ మొదలు పెట్టిన ఏజెన్సీలు
స్టిక్కర్ లేకపోతే ‘అన్‌ఫిట్’ ముద్ర‌
క్యూఆర్ కోడ్ పేరుతో కొత్త బాదుడు
పాత స్టిక్కర్ ఉన్నా మళ్లీ తప్పనిసరంటా..!

కాకతీయ, ఖమ్మం : రవాణా శాఖలో రేడియం స్టిక్కర్ అమలు పేరుతో కొత్త రగడ మొదలైంది. రోడ్డు భద్రత పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం, ఇప్పుడు వాహనదారులకు భారంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్ స్టిక్కరింగ్‌ను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే తప్పనిసరిగా ఈ స్టిక్కర్ వేయించుకోవాలని నిబంధన పెట్టడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. రవాణా కార్యాలయాలకు వచ్చే ప్రతి వాహనానికి ముందుగా కొలతలు తీస్తున్నారు. ఆ తర్వాత స్టిక్కర్ వేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు. ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యాకే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అవుతోంది. లేదంటే వాహనం ‘అన్‌ఫిట్’గా మిగిలిపోతుంది.

 

ఫిట్నెస్ కోసం స్టిక్కర్ తప్పనిసరి

మీటరుకు రూ.150 చొప్పున స్టిక్కర్ ఛార్జ్ విధిస్తున్నారు. వాహనం పరిమాణం ఎంత ఉంటే అంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. చిన్న వాహనానికి రూ.2 వేల వరకు ఖర్చవుతుండగా, పెద్ద వాహనాలకు రూ.7 వేల వరకు బిల్లు పడుతోంది. ఇటీవల ఖమ్మం రవాణా కార్యాలయానికి వచ్చిన ఆర్టీసీ బస్సులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే స్టిక్కర్ ఉన్నప్పటికీ, మళ్లీ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రూ.7 వేల వరకు ఫీజు చెప్పడంతో బస్సులు వెనుదిరిగాయి. ఈ కొత్త విధానం వాహనదారులపై అదనపు ఆర్థిక భారంగా మారింది. గతంలో పూర్తి స్టిక్కరింగ్‌కు రూ.1000లోపే ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదే పని కోసం పలుమార్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. అవగాహన లేకుండా కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు అక్కడే షాక్‌కు గురవుతున్నారు. చేతిలో డబ్బులు లేకపోతే ఫిట్నెస్ లేకుండానే వాహనాలను రోడ్డు మీదకు తీసుకువెళ్తున్నారు. ఇది మరో సమస్యకు దారి తీస్తోంది. ఇంకో వైపు ఈ పాలసీ వల్ల స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సంవత్సరాలుగా రవాణా కార్యాలయాల వద్ద స్టిక్కరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఒక్కసారిగా నిరుద్యోగులయ్యారు. ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించడంతో చిన్న కార్మికుల జీవనోపాధి దెబ్బతింది. రోడ్డు భద్రత కోసం తీసుకొచ్చిన విధానం, అమలులో మాత్రం వాహనదారులకు భారంగా మారింది. ఏజెన్సీల ఆధిపత్యం, అధిక ఫీజులు, అవగాహన లోపం కలిసివచ్చి సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానంపై సమీక్ష చేసి, వాహనదారులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.