epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి
ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన ఆదేశాలు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఆస్తిపన్ను వసూళ్లను శాతం వందకు పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. శనివారం కళాభారతి సమావేశ మందిరంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, వార్డు అధికారులతో జరిగిన సమీక్షలో రోజుకు సుమారు రూ.2.5 కోట్ల టార్గెట్‌తో వసూళ్లు జరపాలని స్పష్టం చేశారు. వసూళ్లలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ విధి నిర్వహణ సక్రమంగా లేకపోతే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్డు అధికారులకు కేటాయించిన టార్గెట్‌లో కనీసం 95 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ ఫీల్డ్ లెవల్ సమస్యలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. టాప్ 200 మొండి బకాయిదారులు, కమర్షియల్, మిక్స్డ్, డబుల్ నెంబర్ ప్రాపర్టీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అసెస్మెంట్‌ను ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సందర్శించి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించని ప్రాపర్టీలను చట్టప్రకారం సీజ్ చేయడంతో పాటు నీటి, విద్యుత్ కనెక్షన్లు తొలగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డబుల్ నెంబర్ల ప్రాపర్టీలకు పాత, కొత్త నెంబర్లకు సంబంధించిన పన్నులు రెండూ వసూలు చేయాలని, రివిజన్ పిటిషన్లు తక్షణమే క్లియర్ చేయాలని, ఆర్‌ఆర్ యాక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రెడ్ నోటీసులు జారీ చేసిన బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ మూడు రోజుల గడువులో డిమాండ్ ప్రకారం వంద శాతం వసూళ్లు పూర్తి చేయాలని కమీషనర్ గట్టిగా ఆదేశించారు. సమావేశంలో డీసీలు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.