epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి..
ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం
టెండర్లు లేకుండానే గోదావరిలో తవ్వకాలు
గిరిజన సొసైటీ పేరుతో అక్రమాల క‌వ‌రింగ్‌
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన
ఎనిమిది నెలలు గడిచినా బదిలీ లేని అధికారి
మైనింగ్, విజిలెన్స్ మౌనంపై జ‌నం నుంచి విమర్శలు

కాకతీయ, మణుగూరు : నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ఒక అధికారి ఇసుక మాఫియాతో చేతులు కలిపి గోదావరిలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి గిరిజన సొసైటీ పేరుతో భారీ దందా నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో డిషీల్టింగ్ పేరుతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి లారీల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. రాంనగర్, బట్టీలగుంపు, చిన్నరాయిగూడెం, అనంతారం, అన్నారం, గుండ్ల సింగారం, విజయనగరం గ్రామాల పేరుతో గిరిజన సొసైటీలు ఏర్పాటు చేసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల పేరును కవర్‌గా ఉపయోగించి వాస్తవానికి గుత్తేదారులతో కలిసి భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నేనే మంత్రి అంటూ దూకుడు..!

జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తూ నేను చెప్పిందే చట్టమంటూ వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ అండదండలతో అక్రమ మైనింగ్‌ను అడ్డగోలుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ఈ అధికారి ఎనిమిది నెలలుగా అదే స్థానంలో కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని ఆరోపణలు వచ్చినా బదిలీ లేకపోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.
నిబంధనల ప్రకారం గిరిజన సొసైటీలు లేబర్, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సేకరించి ఒకచోట నిల్వ చేయాలి. కానీ ఇక్కడ భారీ యంత్రాలతో గోదావరిలో లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. గిరిజనులకు ఉపాధి కల్పించాల్సింది పోయి వారి పేరుతో దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల మౌనం

మైనింగ్, విజిలెన్స్ శాఖలు స్పందించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు అంటున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించబడుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్, విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గోదావరి మరింతగా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.