epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్
వీపీఆర్ కంపెనీలో సేఫ్టీ తనిఖీలు
ప్రమాదం తర్వాత మైన్స్ సేఫ్టీ విభాగం రంగంలోకి
ఫిట్‌నెస్ లేని వందకు పైగా డంపర్లు నిలిపివేత
భద్రతా నిబంధనలపై కఠిన ఆదేశాలు

కాకతీయ, మణుగూరు టౌన్ : కాకతీయలో వెలుగులోకి వచ్చిన ప్రమాద ఘటనతో మణుగూరు ప్రాంతంలోని విపిఆర్ దుర్గ ఓబీ కంపెనీలో అధికార యంత్రాంగం కదిలింది. సింగరేణి మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 పరిధిలో పనిచేస్తున్న ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మైన్స్ సేఫ్టీ విభాగం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కంపెనీలో పనిచేస్తున్న వాహనాల్లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, అనుమతులు లేకుండా నడుస్తున్న డంపర్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సుమారు వందకు పైగా సానీ డంపర్లను తక్షణమే నిలిపివేస్తూ పార్కింగ్ యార్డుకు పరిమితం చేశారు.

    వాహ‌నాల‌కు మ‌ర‌మ్మ‌తులు నిర్వ‌హిస్తున్న దృశ్యం

ఫిట్‌నెస్ లేని వాహనాలు వంద‌ల్లో

గురువారం సెకండ్ షిఫ్ట్ బ్లాస్టింగ్ అనంతరం వాహనాల స్థితిని పరిశీలించిన అధికారులు మొత్తం భారీ డంపర్లలో కేవలం ముప్పై ఐదు వాహనాలకే ఫిట్‌నెస్ అనుమతులు ఉన్నట్లు గుర్తించారు. మిగతా వాహనాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తేలడంతో వాటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓబీ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యానికి కఠిన ఆదేశాలు జారీ చేశారు.

భద్రతా చర్యలపై హెచ్చరికలు

కార్మికులు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలనీ, పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలనీ సూచించారు. హాల్ రోడ్ల నిర్వహణ, లైటింగ్ వ్యవస్థ, వాటర్ స్ప్రేయింగ్ వంటి అంశాల్లో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని ఆదేశించారు. అదే విధంగా కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతి రోజు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మరియు స్టాండర్డ్ ఆపరేషన్ విధానాల ప్రకారం పనులు నిర్వహించాలనే దిశగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక పర్యవేక్షణ బాధ్యతలో భాగంగా సింగరేణి యాజమాన్యానికి కూడా ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గనుల్లో భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాకతీయ కథనంతో బయటపడిన ప్రమాదం అనంతరం అధికారులు కదిలి చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై గనుల్లో భద్రతా ప్రమాణాలు ఎంతవరకు ఖ‌చ్చితంగా అమలు అవుతాయన్నది చూడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.