epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తండ్రే హంత‌కుడు

తండ్రే హంత‌కుడు
కవల పిల్ల‌ల హ‌త్య కేసును చేధించిన పోలీసులు
ఆస్తిపై మోజు.. మగపిల్లాడు కావాల‌నే కోరికతోనే చిన్నారుల అంతం
బావిలోకి తోసేసి హ‌త్య చేసిన‌ ముంచి ఇద్దరు చిన్నారుల హత్య చేసిన తండ్రి
కుటుంబ సభ్యులతో కలిసి పథకం
దాంపత్య కలహాలు, ఆస్తి వివాదాలే కారణం
నలుగురు నిందితుల అరెస్ట్.. మోటార్ సైకిల్, మొబైల్ స్వాధీనం
వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ గౌస్ అలాం

కాక‌తీయ, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో చోటు చేసుకున్న కవల ఆడపిల్లల హత్య కేసు సంచలనంగా మారింది. కన్నతండ్రి కచ్చు శ్రీశైలం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి మోజు, మగపిల్ల కోరికతో సొంత కూతుళ్లనే బావిలో ముంచి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటన, విచారణలో పక్కా పథకం ప్రకారం చేసిన ఘాతుకంగా బయటపడింది. ఏప్రిల్ 3న సాయంత్రం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్వికలను పొలం వద్దకు తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే పిల్లలు బావిలో పడ్డారని చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గీతాంశి మృతదేహం బావిలో నుంచి పైకి తేలగా, గీతాన్విక కోసం అదే బావిలో మరియు పరిసర ప్రాంతాల్లో గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ కుమార్ పరిశీలించి గ్రామంలో ఉద్రిక్తతలు నివారించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దాంపత్య కలహాలు.. 2 కోట్ల ఆస్తే కార‌ణం..!

నిందితుడు శ్రీశైలం జూబ్లీనగర్ గ్రామానికి చెందినవాడు కాగా, అతని భార్య మౌనిక మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందినది. వీరికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నాలుగేళ్ల కవలలు గీతాంశి, గీతాన్విక జన్మించినప్పటి నుంచి మగపిల్ల కోరిక నెరవేరకపోవడం, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సుమారు రూ.2 కోట్ల ఆస్తి అమ్మాయిల పెళ్లిళ్లకే ఖర్చవుతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్‌తో కలిసి చిన్నారులను తొలగించుకోవాలని ముందుగానే కుట్ర పన్నినట్టు విచారణలో తేలింది.

గోపాల్‌పూర్‌లో పట్టుబడిన నిందితులు

పథకం ప్రకారం పిల్లలను బైక్‌పై పొలానికి తీసుకెళ్లి బావిలో తోసి, కాపాడుతున్నట్టు నాటకం ఆడిన శ్రీశైలం ఘటన అనంతరం గోపాల్‌పూర్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. పోలీసులు వేగంగా స్పందించి ఏప్రిల్ 5న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత), కచ్చు లావణ్య (నానమ్మ), కచ్చు రాకేష్ (బాబాయ్)లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్, ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన కరీంనగర్ రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.