“మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి”
కాకతీయ, రామకృష్ణాపూర్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై బిజెపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని, మహిళా రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు కారణమంటూ బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2023 లో బిజెపి ప్రభుత్వం బిల్లును పార్లమెంట్ వేదికగా ఎందుకు చట్టం చేయలేదో ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పల్లె రాజు,కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్,కూతురు ప్రభాకర్,యువజన నాయకులు రంజిత్,రవి,రామ్ సాయి పాల్గొన్నారు.

