ప్రజలకు చల్లని నీరు… సేవలో కాంగ్రెస్ నేతలు
కాకతీయ, నేక్కొండ : ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నర్సంపేట పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట కలిగించే చర్యగా నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలోని హై స్కూల్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు, విద్యార్థులు, ప్రయాణికులకు చల్లని నీరు అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాటు చేయడం మంచి చర్య అని అన్నారు. ఎండల సమయంలో ఇలాంటి చలివేంద్రాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా గ్రామపంచాయతీ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ దయ్యలా సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆవుల శ్రీనివాస్, కొనిజెటి బిక్షపతి, పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ, కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి, ఏజీపీ బండి శివకుమార్, ఉపసర్పంచ్ సింగం శ్రావణి ప్రశాంత్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, చల్లా శ్రీపాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రావుల మహిపాల్ రెడ్డి, తాల్లూరి నర్సింహాస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మైనారిటీ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

