కేశవపట్నంలో గోవింద నామస్మరణ
అంగరంగ వైభవంగా రథోత్సవం వేడుకలు
భక్తులతో కిక్కిరిసిన గ్రామ వీధులు
కాకతీయ, శంకరపట్నం : గోవింద నామస్మరణతో గ్రామం మారుమోగేలా రథోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు. మండలంలోని కేశవపట్నం గ్రామంలో అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదా రంగనాయక స్వామి వారి రథోత్సవం వేడుకలు సోమవారం తెల్లవారుజామున నుంచే వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీగా రథం వద్దకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం సందర్భంగా గ్రామ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, మంత్రోచ్చారణల మధ్య ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
భక్తి పరవశంలో గ్రామం
రథోత్సవం సందర్భంగా గ్రామమంతా భక్తి పరవశంలో మునిగిపోయింది. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీతో ఉత్సవ వాతావరణం నెలకొంది.

