కొనుగోలు కేంద్రాల్లో రూ.2389మద్దతు ధర
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి
కాకతీయ, చిగురుమామిడి : కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, దళారులను నమ్మి పంటను విక్రయించి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం, లంబాడిపల్లె, పీచుపల్లె గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఎస్ఓ నర్సింగరావు, డీఎం రజనీకాంత్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్‌కు 2389 రూపాయల మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. దళారుల బారిన పడకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారా అమ్మకాలు చేయడం ద్వారా నష్టాలు తప్పించుకోవచ్చన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సెంటర్ ఇంచార్జ్‌లకు ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు సమస్యలు ఎదురైతే రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మార్క రాజ్‌కుమార్ గౌడ్, సర్పంచులు కాటం సంపత్ రెడ్డి, బోయిని రమేష్, పీచు సత్యనారాయణ రెడ్డి, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు ఇనుగాల కిష్టారెడ్డి, చీల లక్ష్మారెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ కుతుబుద్దీన్, ఉపసర్పంచులు దెంచనోజు సదాచారి, నక్క ఓదెలు యాదవ్, పూదరి పరుశరాములు గౌడ్, నాయకులు చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, పచ్చిమట్ల జగన్ గౌడ్, పోటు మల్లారెడ్డి, అచ్చ రవీందర్, పింగిలి సంపత్ రెడ్డి, బొట్టు సంపత్, నల్లాల మధుసూదన్ రెడ్డి, బండి ఆదిరెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, పచ్చిమట్ల లక్ష్మి, మహమ్మద్ రసూల్, సంజీవరెడ్డి, ఏఈఓ ఫర్విద్ మహమ్మద్, రైతులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

