epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తులం బంగారం ఇవ్వాల్సిందే

తులం బంగారం ఇవ్వాల్సిందే
పేద‌ల‌కు మేలు చేసే పథకాలు ఆపొద్దు..
పథకాల పేర్లు మార్చినా పరవాలేదు.. లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దు
న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లను యథావిధిగా కొనసాగించాలి
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే డంపింగ్ యార్డ్‌ను అడ్డుకుంటాం
డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రూ. 4.61 కోట్ల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కాకతీయ, హుజూరాబాద్ : పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి చెక్కుతో పాటు వాగ్దానం చేసిన తులం బంగారం కూడా అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 461 మంది లబ్ధిదారులకు రూ. 4,61,53,473 విలువైన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని గుర్తుచేశారు. పథకాల పేర్లు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ పేదలకు అందుతున్న ఫలాలను మాత్రం ఆపవద్దని కోరారు.

డంపింగ్ యార్డ్‌పై యుద్ధం

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ నిర్ణయాన్నైనా తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నేతలకు, అధికారులకు తేల్చి చెప్పారు.

పాత పథకాలు కొనసాగించాలి

గత ప్రభుత్వ హయాంలో గర్భిణీలకు అందించిన న్యూట్రిషన్ కిట్లు, ప్రసవానంతరం అందించే కేసీఆర్ కిట్లు పేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. పేద ప్రజల పక్షాన అసెంబ్లీ లోపల, బయట పోరాడుతూనే ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.