epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టికెట్ ఏదైనా ..యాప్ ఒక్కటే!

టికెట్ ఏదైనా ..యాప్ ఒక్కటే!
మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు
కొద్ది రోజుల్లోనే ఈ యాప్ మంచి ప్రజాదరణ 
ఒక్క టికెట్‌తో అనేక రకాల సౌకర్యాలు 
త‌ప్ప‌నున్న క్యూలైన్ల బాధ‌..
త్వరలోనే మరిన్ని సేవలను ఈయాప్ పరిధిలోకి..
ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు 
కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్..?? లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్ అని వెనక్కుతగ్గుతున్నారా..?? ఇప్పుడా అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. జస్ట్ ఒక్క క్లిక్‌తో వీకెండ్ ప్లాన్ అంతా సాఫీగా జరిగిపోతోంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్ గా ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్ (MEE TICKET APP) డౌన్లోడ్ చేసుకుని, మన ప్రయాణ టికెట్లతో సహా, విజిటింగ్ ప్లేస్ టికెట్లు కూడా ఇంటి దగ్గరి నుంచే బుక్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ పరిధిలో ఉన్న మీసేవ ద్వారా తెచ్చిన ఈ మీటికెట్ యాప్ ఇప్పుడు ఎన్నో సర్వీసులను మీ అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు..
బస్, మెట్రో ప్రయాణ టికెట్లు మొదలు, టెంపుల్స్, పార్కులు, మ్యూజియం, ఫారెస్ట్ సఫారీ సందర్శన ఇలా చాలా రకాల సౌకర్యాలు, వాటి టికెట్లను అక్కడి క్యూ లైన్ తో సంబంధంలేకుండా నేరుగా మనమే బుక్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు మీ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తే సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ లోకేషన్ ను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటు కూడా ఉంది. ఇలా ఇండోర్, అవుట్ డోర్ యాక్టివిటీస్ తో పాటు వివిధ సేవలను ఒకే యాప్ ద్వారా అందించటమే మీ టికెట్ యాప్ లక్ష్యం.
ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్ మంచి ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆరు లక్షలకు పైగా సేవలను పౌరులు బుక్ చేసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయలకుపైగా విలువైన లావాదేవీలు సురక్షితంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించే 219 లోకేషన్లలో ఈ మీ టికెట్ యాప్ ద్వారా అక్కడి సేవలకు సంబంధించిన ప్రవేశ టికెట్లను నేరుగా యాప్ లోనే ప్రజలు పొందుతున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని సేవలను ఈయాప్ పరిధిలోకి తీసుకువస్తామని, ఐటీ సేవలను పౌరసమాజం నిత్య జీవితంలో మరింతగా వాడుకునేలా విస్తరిస్తామని సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సందర్శించే ప్రాంతం ఏదైనా, అక్కడిదాకా వెళ్లి క్యూలైన్ లో నిరీక్షించే బదులు మీటికెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సులభంగా, సౌకర్యవంతంగా అక్కడి ఎంట్రీ టికెట్లను, సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చని మీసేవ కమిషనర్ టీ. రవి కిరణ్ వెల్లడించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.