బ్రహ్మోత్సవాలకు బండి సంజయ్కు ఆహ్వానం
మే 1 నుంచి ముత్తారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వేడుకలు
కేంద్ర మంత్రిని కలిసిన ఆలయ కమిటీ, బీజేపీ నేతలు
కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను గ్రామస్థులు కోరారు. శనివారం కరీంనగర్లోని ఆయన నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో ముత్తారం గ్రామ ప్రతినిధులు మంత్రిని కలిసి వేడుకల విశిష్టతను వివరించారు. గ్రామంలో నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనకం కుమార్, మండల నాయకులు కూనారపు శ్రీనాథ్ యాదవ్, బూరుగుపల్లి హరీష్, బిజిలి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

