చైతన్యపురిలో హిందూ సమ్మేళనం ఘనంగా
సమ్మేళనం లో పాల్గొన్న బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్: పట్టణంలోని చైతన్యపురి బస్తిలోని శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు.
సమ్మేళనానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ జయదేవ్ మాట్లాడుతూ హిందూ సమాజం కులాల పేరుతో విడిపోకుండా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యతే సమాజానికి, ప్రజానీకానికి అపారమైన బలం అందిస్తుందని పేర్కొన్నారు.
సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. స్వధర్మం పట్ల అంకితభావం, సేవా భావం పెంపొందించడమే హిందూ సమ్మేళనాల ముఖ్య లక్ష్యమన్నారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘పంచ పరివర్తన్’ అంశాలతో సమాజంలో చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైతన్యపురి హిందూ సమ్మేళన సమితి నిర్వాహకులు, స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

