epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నగరంలో ‘రౌడీ రాజ్యం’.. 

నగరంలో ‘రౌడీ రాజ్యం’.. 
హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం 
మహిళా పోలీస్ కమిషనర్‌కే రక్షణ లేని దుస్థితి
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
పోలీసులను రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు
బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వ‌జం
కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో :  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళల రక్షణ గాలికొదిలేశారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  దేశానికి అర్ధరాత్రి స్వేచ్ఛ వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు గాంధీజీ కలలు కన్నారని, కానీ నేటి రేవంత్ రెడ్డి పాలనలో మహిళలు పగటిపూట కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని మండిపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో స్వయంగా మహిళా పోలీస్ కమిషనర్ సుమతి గారికే వేధింపులు ఎదురుకావడం అత్యంత శోచనీయమని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటే రక్షించే దిక్కు లేకపోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. సుమారు మూడు గంటల పాటు కనీసం పెట్రోలింగ్ వాహనాల ఊసే లేదని, అసలు షీ టీమ్స్, బ్లూ కోల్ట్స్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ ఆఫీసర్‌కే రక్షణ లేకపోతే సామాన్య మహిళల భద్రత ఏమిటని నిలదీశారు.
పొలిటికల్ పోలీసింగ్ న‌డుస్తోంది
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన అంతర్జాతీయ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ కేవలం ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం వాడుకుంటున్నారని శ్రవణ్ ఆరోపించారు. హైటెక్ నిఘా వ్యవస్థలు ఉన్నా ఒక ఉన్నతాధికారిణిని వేధిస్తున్నా గుర్తించలేకపోవడం దారుణమన్నారు. ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు ఏకంగా 6 శాతం పెరిగాయని, దక్షిణ భారతదేశంలోనే మహిళలపై నేరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గంజాయి బ్యాచ్‌ల హల్‌చల్
నగరంలో అర్ధరాత్రి వేళల్లో గంజాయి మత్తులో ముఠాలు హల్‌చల్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ సభలు, తిట్ల పురాణాలపై ఉన్న శ్రద్ధను పక్కనబెట్టి ప్రజల భద్రతపై దృష్టి సారించాలని హితవు పలికారు. పోలీసులను రాజకీయ అవసరాల కోసం కాకుండా తల్లులు, చెల్లెళ్ల రక్షణ కవచాలుగా మార్చాలని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, గ్రేటర్ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.