మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కాకతీయ, కరీంనగర్ : బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ నగర కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ కామ్రెడ్డి రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు ప్రశాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, చెప్యాల రాజిరెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డితో పాటు డివిజన్ అధ్యక్షురాళ్లు మమత, సత్యలక్ష్మి, వెంకటలక్ష్మి, దివ్య, సబిత, వసంత, పద్మ, రమ తదితరులు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

