పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను శుక్రవారం రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, మానాల గ్రామ ఉప సర్పంచ్ దాసరి అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కుల లక్ష్మీ, నర్సయ్య, పండుగ గంగాధర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు సంగీతం శ్రీనివాస్‌కు శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కట్టుబడి పనిచేస్తోందని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపర్చేందుకు నాయకులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ సంగీతం శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

