epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తూతూ మంత్రంగా ‘హెరిటేజ్ వాక్’!

తూతూ మంత్రంగా ‘హెరిటేజ్ వాక్’!
మొక్కుబడి నిర్వహణపై జాకారం స్థానికుల ఆగ్రహం
ముందస్తు సమాచారం లేక వెలవెలబోయిన కార్యక్రమం
నాకేం సంబంధం లేదంటూ  టూరిజం అధికారి శివాజీ పొంతన లేని సమాధానాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : కాకతీయుల అద్భుత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన ‘హెరిటేజ్ వాక్’ (వారసత్వ నడక) కార్యక్రమం తూతూ మంత్రంగా ముగిసింది. ములుగు జిల్లా జాకారం శివాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం మొక్కుబడిగా సాగడంపై స్థానికులు, చరిత్ర ప్రేమికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తరహాలోనే, చారిత్రక ప్రాధాన్యత కలిగిన జాకారం శివాలయం వద్ద కూడా ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది పూర్తిగా తుంగలో తొక్కారు. హెరిటేజ్ వాక్ నిర్వహణకు సంబంధించి జాకారం గ్రామ ప్రజలకు కనీస ముందస్తు సమాచారం అందించలేదు. ఫలితంగా గ్రామస్తులు ఎవరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాలేకపోయారు. దీంతో ప్రజలను చైతన్యపరచాల్సిన ఈ చారిత్రక నడక కేవలం కొద్దిమంది ప్రభుత్వ అధికారులకే పరిమితమై వెలవెలబోయింది.
కనీస సౌకర్యాలు కరవు.. మురికికూపంగా పరిసరాలు
జాకారం ఆలయ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్నపాటి టెంట్, కొన్ని కుర్చీలు వేసి అధికారులు చేతులు దూలేసుకున్నారని మండిపడుతున్నారు. చారిత్రక ఆలయ పరిసరాలను కనీసం శుభ్రం కూడా చేయకపోవడంతో పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపించింది. ప్రజల భాగస్వామ్యం, కనీస ఏర్పాట్లు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుందని, భవిష్యత్తులోనైనా ముందస్తు సమాచారంతో పకడ్బందీగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పర్యాటక శాఖ అధికారి పొంతన లేని సమాధానాలు
ఈ కార్యక్రమ వైఫల్యంపై జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీని ‘కాకతీయ’ ప్రతినిధి వివరణ కోరగా.. ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. “ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమానికి నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూనే, “ఈ కార్యక్రమం సరిగా జరగలేదు.. కానీ వచ్చే సారి జరిగే కార్యక్రమాలను మాత్రం ఘనంగా నిర్వహిస్తాం” అని పొంతన లేని సమాధానాలు చెబుతూ మాట దాటవేసి వెళ్ళిపోవడం గమనార్హం. జిల్లాలో పర్యాటక రంగాన్ని, చారిత్రక కట్టడాలను పర్యవేక్షించాల్సిన ప్రధాన అధికారే ఇలా బాధ్యత నుండి తప్పుకోవాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.