epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు
జిల్లాలో ఇంకా 60 శాతం వరి కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ
లారీల కొరత, తరుగు పేరిట క్వింటాల్‌కు 10 కిలోల కోత
తీవ్ర ఇబ్బందుల్లో రైతులు: సుంకే రవిశంకర్
సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రాకు వినతి

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40 శాతం వరి ధాన్యాన్నే ప్రభుత్వం కొనుగోలు చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను గురువారం ఆయన కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో తూకాల్లో మోసాలు, అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. గత 45 రోజులుగా లారీల కొరత తీవ్రంగా ఉండటంతో ధాన్యం తూకం వేసినా మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మట్టి తరలింపు వ్యాపారాలపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను, అన్నదాతల ధాన్యం కొనుగోళ్లపై చూపాలని హితవు పలికారు.

తరుగు పేరిట దోపిడీ.. చెదలు పడుతున్న బస్తాలు
కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి నిల్వ ఉంచిన ధాన్యపు సంచులకు కింద నుంచి చెదలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రవిశంకర్ విమర్శించారు. దీనికి తోడు ప్రతి క్వింటాల్ వడ్లకు ఏకంగా 10 కిలోల వరకు తరుగు పేరిట కోత విధిస్తూ రైతులను దారుణంగా నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ‘ఏ’ గ్రేడ్‌గా నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు వెళ్లేసరికి ‘బి’ గ్రేడ్‌గా చూపిస్తూ క్వింటాల్‌కు రూ.20 వరకు తగ్గిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల్లో గన్నీ సంచులు (గోనె సంచులు), హమాలీల కొరత కూడా వేధిస్తోందన్నారు. కొందరు లారీ యజమానులు లోడింగ్ కోసం ప్రతి బస్తాకు రూ.2 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా నివారించే నాథుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధప్రాతిపదికన తరలించాలి
జిల్లాలో దాదాపు 60 శాతం వరి ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతూ నిల్వ ఉండిపోయిందని, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు గుండెచేతుల్లో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందువల్ల మట్టి తరలింపునకు వినియోగిస్తున్న లారీలను తక్షణమే ధాన్యం రవాణాకు మళ్లించాలని, యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి మరియు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.