epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దారిదోపిడీ నిందితుల అరెస్టు

దారిదోపిడీ నిందితుల అరెస్టు
24 గంటల్లోనే ఎనిమిది మంది అరెస్ట్
నిందితుల నుంచి నగదు, బంగారం, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన జమ్మికుంట ఏసీపీ మాధవి

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామంలో రోడ్డుపై పోలీసుల‌మ‌ని చెబుతూ దోపిడీకి పాల్ప‌డిన ఎనిమిది మందిని జ‌మ్మికుంట పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదైన 24 గంటల్లోనే 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నగదు, రూ.38 వేల ఆన్‌లైన్ బదిలీ సొమ్ము, అర తులం బంగారం ఉంగరం, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మాధవి వెల్లడించారు. శుక్రవారం జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. అరెస్ట్ అయిన వారిలో పల్లపు ఈశ్వర్ అలియాస్ బన్నీ, పల్లపు అశోక్, ఎలకపల్లి ప్రమోద్, చుక్కారపు అఖిలేష్, మొగుళ్ల రాకేష్, పల్లపు మహేష్ (మల్లయ్య కుమారుడు), పల్లపు మహేష్ (రాములు కుమారుడు), తప్పేలా వంశీ ఉన్నారు. వీరి నుంచి రూ.14 వేల నగదు, దోచుకున్న అర తులం బంగారం ఉంగరం, నేరానికి ఉపయోగించిన నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఏసీపీ తెలిపారు.

దాడి చేసి.. వ‌సూళ్లు..
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు నుంచి వస్తున్న ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని (టీఎస్ 08 యూడీ 5457) 11 మంది దుండగులు అడ్డగించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసి, వారిని సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాం ఖాళీ ప్రదేశానికి ఈడ్చుకెళ్లారు. బాధితులను చంపేస్తామని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. అంతటితో ఆగకుండా బాధితుల మొబైల్స్ ద్వారా ఫోన్‌పే యాప్ ఉపయోగించి బలవంతంగా రూ.38 వేలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత మరో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బాధితులను రైల్వే స్టేషన్ వైపు తరలిస్తుండగా, వారు ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశారు. బాధితుల అరుపులు విని స్థానికులు అప్రమత్తమవడంతో నిందితులు అక్కడి నుంచి చీకట్లోకి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జమ్మికుంట పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మే 21 ఉదయం సైదాబాద్ ఎక్స్‌రోడ్–కోరపల్లి మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దోపిడీ నేరాన్ని అంగీకరించారు. అత్యంత చాకచక్యంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న జమ్మికుంట సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ రవి, హుజూరాబాద్ ఎస్ఐ రాధాకృష్ణ, ఐడీ పార్టీ సిబ్బందిని ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.