epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం

బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ తీవ్ర వ్య‌తిరేక‌త‌..ప‌రిపాల‌న‌లో కాంగ్రెస్ విఫ‌లం
ప్రజాపాలన పేరుతో సర్కారు నియంతృత్వ ధోరణి
మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి
రైతుల పక్షాన మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ దుర్మార్గం
ఉద్యోగిని విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం కార్యాలయం ముట్టడి
కరీంనగర్‌ను పార్టీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలి
గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలి
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్
కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నందున తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విస్తృతంగా నిర్వహించి కరీంనగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలను సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై సస్పెన్షన్ విధించడం దుర్మార్గమన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్‌పై ఆగ్రహం
ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గంగుల కమలాకర్ మండిపడ్డారు. డ్రైవర్ అశోక్ సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రం సమర్పించారు. డ్రైవర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆర్‌ఎం కార్యాలయం ఎదుట బైఠాయింపు చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు. అశోక్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రెండు కార్యక్రమాలలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి కొండూరి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.