యువతకు అండగా రిటైర్డ్ ఏడీఈ లక్ష్మణ్ నాయక్
మానాల గ్రామ క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేత
కాకతీయ, వేములవాడ : రుద్రంగి మండలం మానాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఏడీఈ భూక్యా లక్ష్మణ్ నాయక్ గ్రామ యువకులకు ఉచితంగా క్రికెట్ కిట్‌ను అందజేశారు. గ్రామ యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆయన ఈ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్‌ను గ్రామ క్రీడాకారులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు యువతను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ తుమ్ జలపతి, జక్కు మోహన్, గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగా నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, పలువురు తండాల సర్పంచులు, మానాల స్పోర్ట్స్ క్లబ్ యువకులు పాల్గొన్నారు.

