epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ ‘సదరం’

నకిలీ ‘సదరం’
హుజురాబాద్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా
ఏళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులు
నిజమైన వికలాంగుల హక్కులను కాలరాస్తూ కొల్లగొడుతున్న వైనం
అక్ర‌మంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలని జ‌నాల‌ డిమాండ్
అక్రమాల నెట్‌వర్క్‌పై నోరు మెదపని అధికారులు
మౌనం వెనుక అసలు కారణాలేంటి?
గతంలో ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లుగా అధికారుల వైఖ‌రి
కలెక్టర్ చిత్రామిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని కోరుతున్న జ‌నం

కాక‌తీయ‌, కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో నకిలీ సదరం సర్టిఫికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. అర్హత లేకపోయినా కొందరు వ్యక్తులు ఫేక్ సదరం ధ్రువపత్రాలతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారి ఏళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా వికలాంగులైన వారికి అందాల్సిన ప్రయోజనాలను అక్రమ మార్గాల్లో కొందరు దోచుకుంటున్నారనే ఆవేదన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, శారీరక వైకల్యం లేకపోయినా కొందరు వ్యక్తులు నకిలీ సదరం సర్టిఫికెట్లు పొందుతూ వికలాంగుల పెన్షన్లు, రాయితీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ వ్యవహారం ఒక్కరోజులో ఏర్పడింది కాదని, దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన వికలాంగులు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటే, దర్జాగా ఉన్నవారు నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ డబ్బులు కొల్లగొడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో కూడా ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత శాఖలు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొమ్ము రికవరీ చేయాల్సిందే
ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా పొందిన పెన్షన్లు, ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని కోరుతున్నారు. ఇందులో పాల్గొన్న మధ్యవర్తులు, సిఫారసులు చేసిన వ్యక్తులు, అక్రమాలకు సహకరించిన అధికారుల పాత్రపైనా లోతైన దర్యాప్తు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలపై చిన్న తప్పులకే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, ఇలాంటి పెద్ద మోసాల విషయంలో ఎందుకు నిద్రపోతున్నారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల మౌనంపై అనుమానాలు
నకిలీ సదరం సర్టిఫికెట్ల వ్యవహారం బహిరంగంగా చర్చకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులను కాపాడేందుకే వ్యవస్థ మౌనం పాటిస్తోందా, లేక రాజకీయ ప్రభావశీలుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఒక సమగ్ర విచారణ జరిపించాలని హుజురాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఫేక్ సదరం సర్టిఫికెట్ల మాఫియాను బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా పొందిన ప్రభుత్వ సొమ్మును తిరిగి రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.