epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సంతోష్ రావుకు బిగిస్తున్న ఉచ్చు

సంతోష్ రావుకు బిగిస్తున్న ఉచ్చు
మైనింగ్ అక్ర‌మాల‌పై సీఐడి నివేదిక‌
మానేరు కేంద్రంగా సాగిన దందాపై సర్కార్ ఫోకస్
అక్ర‌మంగా వందల కోట్ల ఇసుక త‌ర‌లింపు జ‌రిగిన‌ట్లుగా గుర్తింపు
ఒకే పర్మిట్‌తో 4 ట్రిప్పులు, నకిలీ వే బిల్లులతో ఖజానాకు భారీగా గండి
మైనింగ్ శాఖ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన సీఐడీ.. గులాబీ నేతల్లో టెన్షన్
అప్పట్లో సంచలనం సృష్టించిన నేరేళ్ల థర్డ్ డిగ్రీ ఘటన
ఇసుక మాఫియా వెనుక పొలిటికల్ హ్యాండ్స్‌.. చేతివేళ్ల‌న్నీ సంతోష్ వైపే

కాక‌తీయ‌, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణలో మైనింగ్ మాఫియా లక్ష్యంగా సాగుతున్న విచారణలు, ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా సాగిన మానేరు ఇసుక దందా వ్యవహారంపై అధికార యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. అప్పట్లో అధికార పార్టీ అండదండలతో సాగిన ఈ ఇసుక అక్రమాల వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా పేరున్న మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పాత్రపై ఇప్పుడు గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) రంగంలోకి దిగడంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర అలజడి మొదలైంది.

వందల కోట్ల లూటీ.. పక్కా స్కెచ్‌తో దోపిడీ

సిరిసిల్ల కేంద్రంగా మానేరు వాగులో సాగిన ఇసుక మాఫియా కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల‌లో నష్టం వాటిల్లినట్లు మైనింగ్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన‌ట్లు స‌మాచారం. గత ప్రభుత్వ హయాంలో రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజూ సుమారు 800 టిప్పర్ల ఇసుకను హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించారని సమాచారం. దర్యాప్తులో వెలుగుచూసిన ప్రధాన అక్రమాలను పరిశీలిస్తే, వన్ పర్మిట్ – ఫోర్ ట్రిప్స్ విధానాన్ని అమ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. అంటే ఒకే అనుమతి పత్రం ఉపయోగించి నాలుగు సార్లు ఇసుకను లోడ్ చేసి తరలించారు. రవాణా సాఫీగా సాగేందుకు నకిలీ వే బిల్లులను సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారు. జీపీఎస్, ఆన్‌లైన్ ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వాహనాలు నడిపారు. నిబంధనల ప్రకారం 3 మీటర్ల లోతు వరకే అనుమతి ఉన్నా, భారీ యంత్రాలతో 25 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వేశారు. దీనివల్ల భూగర్భ జలాలు పడిపోయి పలు గ్రామాల్లో బావులు ఎండిపోయినట్లు గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), కాగ్ తమ నివేదికల్లో ఎండగట్టాయి.

నేరేళ్ల ఉదంతం.. కేటీఆర్ ఇమేజ్‌పై ప్రభావం

మానేరు ఇసుక దందా మళ్లీ తెరపైకి రావడంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటనను రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన నేరేళ్ల గ్రామస్తులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇసుక మాఫియాకు బలమైన రాజకీయ అండ ఉండటం వల్లే ఆనాడు అంతటి దారుణం జరిగిందనే విమర్శలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ ఇసుక వ్యవహారం కారణంగా అప్పట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరిసిల్ల నియోజకవర్గంలో సాగిన ఇసుక అక్రమాలు, నేరేళ్ల ఘటన స్థానికంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి, ఇది కేటీఆర్ ఇమేజ్‌పైనా తీవ్ర ప్రభావం చూపింది.

తాజా విచార‌ణ‌తో ఉత్కంఠ‌

2014 నుంచి 2026 వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, మైనింగ్ శాఖ తన ప్రాథమిక నివేదికను సీఐడీకి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సూత్రధారులు, పాత్రధారుల జాబితాను సీఐడీ సిద్ధం చేస్తోంది. విచారణ మరింత ముమ్మరమైతే మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని, ఇది తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.