epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మునిసిపాలిటీలో ముస‌లం

మునిసిపాలిటీలో ముస‌లం
మూడు నెలలకే మొద‌లైన విబేధాలు
హుజురాబాద్ మునిసిపాలిటీలో రోజుకో గ‌డ‌బిడ‌
రూ. 4.5 కోట్ల అభివృద్ధి పనుల ఆమోదంపై కౌన్సిలర్ల భిన్నాభిప్రాయాలు
30 మందిలో 19 మంది విమ‌ర్శ‌ల రాగం..
సంయుక్త ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్
చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ మధ్య లోపించిన సయోధ్య
వార్డుల్లో పనులు ప్రారంభం కాకపోవడంపై నిలదీస్తున్న కౌన్సిలర్లు
అధికారిక ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ చిచ్చు.. వర్గాలుగా విడిపోతున్న వైనం

కాక‌తీయ , కరీంనగర్/హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు కూడా పూర్తికాకముందే కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి పనుల ఆమోదం, నిధుల కేటాయింపు, అధికార ప్రాధాన్యత అంశాల చుట్టూ మున్సిపల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రూ. 4.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. సమావేశంలో పలు ప్రతిపాదనలకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే సమావేశం ముగిసిన అనంతరం 30 మంది కౌన్సిలర్లలో 19 మంది సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది. తాము అన్ని పనులకు ఆమోదం తెలపలేదని, కొన్ని ప్రతిపాదనలకే మద్దతు ఇచ్చామని వారు పేర్కొనడం గమనార్హం.

వార్డుల్లో పనులు లేవు.. జనరల్ ఫండ్‌పై పంచాయతీ
ఎన్నికై మూడు నెలలు దాటుతున్నప్పటికీ తమ వార్డుల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ఫండ్ నుంచి ప్రతి వార్డుకు సమానంగా నిధులు కేటాయించి పనులు చేపట్టాలని వారు గట్టిగా కోరుతున్నారు. ప్రజలు తమను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సమన్వయంతో ముందుకు సాగుతారని భావించినప్పటికీ, మూడు నెలలు పూర్తికాకముందే పాలకవర్గంలో విభేదాలు బయటపడటం చర్చకు దారితీసింది.

ప్రోటోకాల్ చిచ్చు.. అధికార పోరు
ఇటీవల జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్‌కు తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి కూడా ఈ విభేదాలకు ప్రధాన కారణమైందన్న చర్చ సాగుతోంది. వేదికపై ఆహ్వానం, కార్యక్రమాల్లో గుర్తింపు వంటి ప్రోటోకాల్ అంశాలపై అసమ్మతి వ్యక్తమైంది. ఇదే క్రమంలో కౌన్సిలర్ల మధ్య ఇప్పటికే ఉన్న అంతర్గత గ్రూపుల తగాదాలు మరింత బహిర్గతమయ్యాయి. అధికార పార్టీకే చెందిన 19 మంది కౌన్సిలర్లు ఒకేతాటిపైకి వచ్చి బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా, మూడు నెలలకే హుజూరాబాద్ మున్సిపాలిటీలో తెరపైకి వచ్చిన ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.