epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాలం చెల్లిన పురుగుమందులు కాలువలో డంప్‌

కాలం చెల్లిన పురుగుమందులు కాలువలో డంప్‌
ఎస్సారెస్పీ కెనాల్‌లో పెస్టిసైడ్స్ డబ్బాలు పడేసిన వైనం
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం సమీపంలో నిర్వాకం
‘వర్షపు నీటిలో విషం కలిస్తే మూగజీవాల పరిస్థితి ఏమిటి?’
ఫర్టిలైజర్ షాపును సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

కాకతీయ, ఇనుగుర్తి : “కాలం చెల్లిన పురుగుమందులను కంపెనీకి తిప్పి పంపాల్సింది పోయి, బాధ్యతారహితంగా కాలువలో పడేస్తారా? వర్షాకాలం ప్రారంభమైన వేళ ఈ విషపూరిత ద్రావణాలు నీటిలో కలిస్తే.. ఆ నీరు తాగి మూగజీవాలు ప్రాణాలు కోల్పోవా? ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు ఇంతటి దారుణానికి ఒడిగడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?” అని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం, ఎర్రబెల్లిగూడెం గ్రామాల రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ డీబీఎం 48, 10 ఆర్ 1 కెనాల్ వద్ద చోటుచేసుకున్న ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయమై స్థానిక రైతులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. “చిన్ననాగారం సమీపంలోని ఎర్రబెల్లి గూడెం రోడ్డు వైపు ఉన్న శ్రీరాంసాగర్ కాలువలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన పెస్టిసైడ్స్ మందుల కాటన్ డబ్బాలను, ప్లాస్టిక్ సీసాలను విసిరి పారేశారు. పరిశీలించి చూడగా.. అది పత్తి, వేరుశనగ తదితర పంటల్లో కలుపు నివారణకు వాడే ‘పెండి మెథలిన్’ అనే ప్రమాదకర ద్రావణంగా తేలింది. దీని కాలపరిమితి 2023తోనే ముగిసిపోయింది. సమీపంలోని ఏదో ఒక పురుగుమందుల షాపు నిర్వాహకులే ఈ పని చేసి ఉంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో కాలువలోకి నీరు వచ్చి, ఆ ప్లాస్టిక్ డబ్బాలు పగిలితే విషమంతా నీటిలో కలుస్తుంది. ఆ నీటిని తాగే పశువులు, ఇతర మూగజీవాలు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులైన పెస్టిసైడ్ షాపును గుర్తించి, దానిని సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.