epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సుడాలో ‘సిండికేట్’ టెండర్లు

సుడాలో ‘సిండికేట్’ టెండర్లు
రూ.7 కోట్ల అభివృద్ధి పనులపై ముందస్తు ఒప్పందాలు
35 పనుల పంపకాలపై డీల్.. 8-10 శాతం పగిడీల వసూలు?
డబుల్ బిడ్లతో పోటీ వాతావ‌ర‌ణానికి గండి
స్వేచ్ఛగా టెండ‌ర్లు వేసే విధానానికి పాత‌ర‌
అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కు
ప్రభుత్వ ఖజానాకు కోట్లలో న‌ష్టం

కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ సుడా పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కేవలం నిబంధనల నిర్వహణకే పరిమితమైన టెండర్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు, కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి పనులను పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.7 కోట్ల విలువైన 55 అభివృద్ధి పనుల కేటాయింపులో జరిగిన ఈ ‘ముందస్తు ఒప్పందాలు’ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. మొత్తం 55 పనుల్లో ఇప్పటికే 35 పనుల పంపకాలపై అవగాహన కుదిరినట్లు సమాచారం. ఏ పని ఎవరికి దక్కాలి? ఎవరికి ఎంత వాటా రావాలి? అనే అంశాలపై టెండర్లు పిలవక ముందే ఒప్పందాలు జరిగిపోయాయని కాంట్రాక్టర్ల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టెండర్ ప్రక్రియ అంతా కేవలం నామమాత్రపు ‘డ్రామా’ అని, ఫలితాలు ముందే ఖరారైనవేనని విమర్శలు వస్తున్నాయి.

పగిడీల దందా.. ‘బిడ్ల’ మాయాజాలం
ఈ అక్రమ దందాలో పగిడీల సంస్కృతి జోరందుకుంది. ప్రతి పనిపై 8 నుంచి 10 శాతం వరకు పగిడీలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోటీని దెబ్బతీసేందుకు సిండికేట్‌కు చెందిన వారే ‘డబుల్ బిడ్లు’ దాఖలు చేస్తూ, ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పారదర్శకతను దెబ్బతీస్తూ సాగుతున్న ఈ బిడ్ల మాయాజాలం వల్ల కొత్త వారికి, నిజాయితీ గల కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. స్వేచ్ఛాయుత పోటీ లేకపోవడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పోటీ లేనప్పుడు టెండర్లు అధిక ధరకు ఖరారయ్యే అవకాశం ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. పైగా, సిండికేట్ పంచుకున్న పనుల్లో నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండదని, ఇది భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అక్రమ ఒప్పందాలతో కుదుర్చుకున్న పనులు కాబట్టి, వాటిని పూర్తి చేయడంలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.

ఉన్నతాధికారుల స్పందన ఏది?
సుడా పరిధిలో జరుగుతున్న ఈ టెండర్ల అక్రమాలపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సిండికేట్ బాగోతాన్ని బయటపెట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో అభివృద్ధి పనులన్నీ కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపే సాధనాలుగా మారుతాయని, ప్రజాధనం వృథా అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సుడా యంత్రాంగం నిద్రమత్తు వీడి, పారదర్శకతను కాపాడుతుందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా? అన్నది వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.