epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మం నగర ప్రగతి భేష్

ఖమ్మం నగర ప్రగతి భేష్
పర్యావరణ కేంద్రంగా డంపింగ్ యార్డు
ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి
అధ్యయనం చేసిన ధర్మపురి మున్సిపల్ బృందం
ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

కాకతీయ, మయూరి సెంటర్ : నగర సమగ్ర అభివృద్ధిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేములను నాగలక్ష్మి అన్నారు. అభివృద్ధి పనులను, పర్యావరణ పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు ఆమె నేతృత్వంలోని మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారుల ఉన్నత స్థాయి బృందం గురువారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించింది. పర్యటనలో భాగంగా బృందం మొదట 54వ డివిజన్‌లోని ఎన్టీఆర్ పార్కును, అనంతరం యశస్వి రోడ్డులోని మున్సిపల్ నర్సరీని సందర్శించింది. అక్కడ మొక్కల పెంపకానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, పార్కులోని ఆధునిక వసతులు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ధర్మపురిలో కూడా ఇలాంటి మోడల్ పార్కును ఏర్పాటు చేస్తామని నాగలక్ష్మి ప్రకటించారు. నగర డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో-మైనింగ్ ప్రక్రియను చూసి బృందం ఆశ్చర్యపోయింది. దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి, 22 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. బయో-మైనింగ్ ద్వారా వేరు చేసిన ‘బయో-సాయిల్’ను పచ్చదనం కోసం వాడుతుండటం విశేషమని, తమ ప్రాంతంలో కూడా డంపింగ్ యార్డులను ఇలాంటి ఆధునిక ప్రాసెసింగ్ కేంద్రాలుగా మారుస్తామని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు.

లకారం చెరువు స్ఫూర్తితో..
ఖమ్మం నగరంలో రూ. 250 కోట్లతో నిర్మిస్తున్న నూతన మిర్చి మార్కెట్, లకారం చెరువు పునరుద్ధరణ పనులను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లకారం చెరువు సుందరీకరణ స్ఫూర్తితో ధర్మపురిలోని చెరువును కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైస్ చైర్‌పర్సన్ ఇందరపు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ మేయర్ పి. నీరజ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారిణి బెల్లం రాధిక, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు మహేష్, శ్రీనివాస్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ గంగాధర్, స్థానిక మాజీ కార్పొరేటర్లు, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.