కాకతీయ ఎఫెక్ట్.!
ప్రమాదకర విద్యుత్ స్తంభం తొలగింపు

కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలంలోని మనాల గ్రామంలో ప్రమాదకరంగా ఒరిగి ప్రజలు, వాహనదారులకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభంపై కాకతీయ దినపత్రిక ఈ నెల 11వ తేదీన ప్రచురించిన కథనం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఈ సమస్యపై కథనం వెలువడిన వెంటనే గ్రామ సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్ తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి తక్షణ చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ లైన్‌మెన్ల సహకారంతో ప్రమాదకర స్థితిలో ఉన్న పాత విద్యుత్ స్తంభాన్ని తొలగించారు. స్తంభం ఏర్పాటుకు అడ్డంగా ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించి, అదే స్థానంలో నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల నెలకొన్న ప్రమాదం పూర్తిగా తొలగిపోయింది. సమస్యను వేగంగా పరిష్కరించిన సర్పంచ్ బుర్ర శంకర్, ఉప సర్పంచ్ దాసరి అశోక్, పాలకవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ లైన్‌మెన్లను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన కాకతీయ దినపత్రిక పాత్ర ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు సంద రాజం, విద్యుత్ శాఖ లైన్‌మెన్లు శ్రీనివాస్, లింబ తదితరులు పాల్గొన్నారు.

