epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాల ఘన చరిత్ర చెరిపివేత‌

చేర్యాల ఘన చరిత్ర చెరిపివేత‌
చారిత్ర‌క ఆన‌వాళ్లు నేల‌మ‌ట్ట‌మై నాలుగేళ్లు
తొందరపాటు నిర్ణయాలతో మున్సిపల్ భవనం కూల్చివేత
పాత ప్రభుత్వ ఆస్పత్రిలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు
ప్రజలకు అసౌకర్యం.. వ్యాపారులకు తీరని నష్టం
నూత‌న నిర్మాణాల‌కు ఇంకెన్నాళ్లు?.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత

కాకతీయ, చేర్యాల : చారిత్రక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన చేర్యాల మున్సిపల్ భవనాన్ని అనాలోచిత ని ర్ణయంతో పునర్నిర్మాణం పేరిట హడవుడిగా కూల్చివేశారు. కార్యాలయ భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్సులను నేలమట్టం చేశారు. చేర్యాల ప్రభుత్వ పాత హాస్పత్రికి మున్ని పల్ కార్యాలయాన్ని తరలించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజాంకాలంలో నల్గొండ జిల్లాలో చేర్యాల తహశీల్ కేంద్రంగా వెలుగొందింది. ఆనాడు నైజాం అధికారులు రాచరిక పనులపై చేర్యాలను సందర్శించినప్పుడు విశ్రాంతి కేంద్రంగా ఈ భవనం ఉపయోగపడింది. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయంగా సేవలందించింది. తదనంతర పరిణామాల్లో గ్రామపంచాయతీగా మార్పు చెందింది. ఈ క్రమంలో పాత భవనం స్థానంలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ గా ఏర్పడి పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా సేవలదించింది. ఇంతటి నేపథ్యం ఉన్న మున్సిపాలిటీ, దుకాణ సముదాయాన్ని కూల్చివేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్సులో ఎంతో మంది చిరు వ్యాపారులు జీవనోపాధి పొందారు. చిన్న చిన్న దుకాణాలు నిర్వహించు కుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. భవనాన్ని కూల్చివేయడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఇంకా యాభై ఏళ్ల పాటు సేవలు అందించే సామర్యం ఉన్న భవన సముదాయాన్ని ప్రజలు, ప్రముఖులు, వ్యాపారస్తులు,రాజకీయ పార్టీలు, సంఘాల అభిప్రాయం తీసుకోకుండానే స్వార్ధ ప్రయోజనాలు, కమీషన్ల కోసం కూల్చివేశారన్న విమర్శలను మున్సిపల్ పాలక మండలి, ప్రభుత్వం మూటగట్టుకుంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల మున్సిపాలిటీకి సొంత భవనం లేకుండా పోయింది. మున్సిపాలిటీకి ఆదాయం సమాకురుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నదుకాణ సముదాయం కులగొట్టడంతో అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు రోడ్డునపడ్డారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కొరకు ప్రభుత్వం ప్రతి పాదనలు సిద్ధం చేసిన కట్టడం ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అది పూర్తి కావాలంటే ప్రస్తుతం చేర్యాల పట్టణంలోని అంగడి బజారులో ఉన్న సింహభాగానికి నిరందిస్తున్న 320 కేఎల్ సామర్థ్యం ఉన్న మంచి నీటి ట్యాంకును కూల్చి వేయ్యాల్సి ఉంటుంది. ఇది నిర్మించి సుమారుగా 50 ఏళ్లు అవుతుంది. కాగా శిధిలా వ్యవస్థలో ఉండగా ప్రాణా ప్రమాదానికి పొంచి ఉంది.

అధికార పార్టీ, ఎమ్మెల్యేపై విమర్శలు

తొందరపాటు నిర్ణయాలతో చేపట్టిన కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితులను అధికార పార్టీ నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టించుకోవడం లేదని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా షెడ్లు తొలగించారని, దీంతో అనేక కుటుంబాలు ఉపాధి, జీవనాధారాన్ని కోల్పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు జరిగినప్పటి నుంచి బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నష్టపరిహారం లేదా పునరావాసంపై కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శింస్తున్నారు.బాధితుల పరిస్థితిని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి తక్షణ చర్యలు చెప్పటి షేటర్ల నిర్మాణాలు చేపట్టి వారికీ అండగా నిలవాలని కోరుతున్నారు.

షెడ్డు నిర్మాణంతో డబ్బు వృథా

మున్సిపల్ దకాణ సముదాయాన్నికూల్చినప్పటి కీ పాత భవన స్థలంలో వెజ్, నాన్ వెజ్ వ్యాపారుల కోసం కాంప్లెక్స్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. వాటితో వెజ్ మార్కెట్ నిర్మించగా వెజ్ వ్యాపారస్తులు కాంప్లెక్సులో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనాలోచితంగా రేకుల షెడ్డుతో నిర్మించిన నాన్ వెజ్ షెడ్డులో వాటర్ సౌకర్యం, డ్రైనేజీతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారస్తులు షెడ్డులో వ్యాపారం చెయ్యలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా నిర్మించిన షెడ్డు కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. నాన్ వెజ్ వ్యాపారస్తులు అంగడి బజార్ లోని మున్సిపల్ ఆవరణలో ఉన్నరోడ్డుకు ఇరువైపులా తాత్కాలికంగా పరదాలతో షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నప్పటికీ పాలకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి షేటర్ల నిర్మాణాలు చేపడతారో లేదో వేచి చూడాల్సిందే.

గత ప్రభుత్వం నిర్ణయంతో రోడ్డున పడ్డాం
– జామలపూర్ శ్రీనివాస్, మటన్ షాపు వ్యాపారి

మున్సిపల్ కాంప్లెక్సులో దశాబ్దాలుగా 15 మటన్ షాపులు, 14 చికెన్ షాపులు నడుపుకుంటూ వ్యాపారం చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనాలోచితంగా కొత్త భవనాల నిర్మాణం పేరిట కూల్చివేతతో వ్యాపారులం దరం నిరాశ్రయులయ్యాం. వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ భవనం కొత్తగా నిర్మించి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నది. ఎలాంటి సౌకర్యం లేకుండా నిర్మించడం వల్ల కాంప్లెక్స్ భవనంలోకి వెళ్లలేకపోతున్నాం. వెంటనే కొత్తగా షట్టర్లతో నిర్మాణాలు చేపట్టి యథావిధిగా షాపులను మాకు కేటాయించాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.