epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాన్ షాపులకేనా నిబంధనలు..?

పాన్ షాపులకేనా నిబంధనలు..?
బార్లు, వైన్ షాపులకు వర్తించవా..?
కరీంనగర్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ‘100 మీటర్ల’ వివాదం
చిన్న వ్యాపారులపైనే దండయాత్ర.. పెద్దలకు మినహాయింపులా?
చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలంటున్న స్థానికులు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : విద్యాసంస్థలకు సమీపంలో పాన్ షాపుల తొలగింపుపై అధికారులు వరుస చర్యలు చేపడుతుండగా, అదే నిబంధనలు బార్లు, వైన్ షాపుల విషయంలో ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్న కరీంనగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “చట్టం ఒకరికి ఒకలా.. ఇంకొకరికి ఇంకోలా ఉంటుందా?” అంటూ సామాన్య ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. చిన్న వ్యాపారులపై వెంటనే కొరడా ఝళిపిస్తున్న అధికారులు, భారీ టర్నోవర్ కలిగిన మద్యం దుకాణాల అక్రమాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాన్ షాపులపై వేగం.. బార్లపై ఎందుకు మౌనం?
విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఓటీపీఏ (COTPA) – 2003 చట్టంలోని సెక్షన్ 6(బి) ప్రకారం పాన్ షాపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సు రద్దు చేసేలా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బార్లు, వైన్ షాపులు కూడా విద్యాసంస్థలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఆసుపత్రులకు నిర్దిష్ట దూరంలోనే ఉండాల్సి ఉంటుంది. రూల్-25 ప్రకారం సాధారణంగా 100 మీటర్ల దూరం పాటించాల్సి ఉండగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 50 మీటర్ల వరకు మినహాయింపు ఉందంటూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాత లైసెన్సులతో కొనసాగుతున్న మద్యం దుకాణాలకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయని కాలయాపన చేస్తున్నారు.

ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల పక్కనే మద్యం దుకాణాలు!
కరీంనగర్ నగరంలోనే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు అతి సమీపంలో బార్లు, వైన్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాన్ షాపులను సీజ్ చేస్తూ, పేద వ్యాపారుల పొట్ట గొడుతున్న అధికారులు.. అదే ప్రమాణాలను బార్లు, వైన్ షాపుల విషయంలో ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పొగాకు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తే, మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, నేరాలు చోటుచేసుకోవడం లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అంశంపై అధికారులు మాత్రం శాఖల పరిధి వేరుగా ఉండటమే కారణమని దాటవేస్తున్నారు. పాన్ షాపులపై పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే, బార్లు, వైన్ షాపుల అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుందని సర్దిచెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో 50 మీటర్ల నిబంధన వర్తిస్తుందని, పాత లైసెన్సుల విషయంలో కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటున్నారు.

సంయుక్త సర్వే చేయాలని డిమాండ్
అయినప్పటికీ ప్రజలు మాత్రం సమాన న్యాయాన్నే కోరుతున్నారు. పోలీసు, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, బార్లు, వైన్ షాపుల సంపూర్ణ జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హోదా, ఆర్థిక బలం చూడకుండా ఒకే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భద్రత పేరుతో చేపడుతున్న చర్యలు నిజంగా పారదర్శకంగా సాగాలంటే చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం నిరూపించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే “చిన్న వ్యాపారులపైనే దండయాత్ర.. పెద్ద వ్యాపారులకు మినహాయింపులు” అనే భావన బలపడి, ఈ చర్చ త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం...

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల...

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు అక్రమ రవాణాపై...

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి అమరుడి కుటుంబానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.