epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రకృతి బ్లెస్సి పచ్చని సంకల్పం!

ప్రకృతి బ్లెస్సి పచ్చని సంకల్పం!
అడవికి ఊపిరి పోస్తున్న ‘బాల’ వనం

కాక‌తీయ‌, వేములవాడ : వయసు పన్నెండేళ్లు.. కానీ ఆ చిన్నారి భుజాన వేసుకున్న బాధ్యత మాత్రం ఎంతో గురుతరమైనది. చేతిలో స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేసే ఈ తరం పిల్లల మధ్య, విత్తనాల సంచి పట్టుకుని అడవుల కోసం అడుగులు వేస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి బ్లెస్సి. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించాలనే దృఢ సంకల్పంతో ఈ బాల యోధురాలు చేస్తున్న పర్యావరణ పోరాటం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బ్లెస్సి ప్రయాణం ఐదేళ్ల‌ వయసులోనే మొదలైంది. పర్యావరణ ప్రేమికుడైన తండ్రి ప్రకృతి ప్రకాష్ అందించిన స్ఫూర్తితో, గత ఏడేళ్లుగా ఏమాత్రం విరామం లేకుండా విత్తనాలను సేకరించడం, వాటిని ‘సీడ్ బాల్స్’ (విత్తన ఉండలు)గా మార్చి అడవుల్లో వెదజల్లడం ఈ చిన్నారి దినచర్యలో భాగమైంది.

సీడ్ బాల్స్‌తో పచ్చని విప్లవం
కేవలం మొక్కలు నాటడమే కాదు, ప్రకృతి సిద్ధంగా చెట్లు పెరిగేలా సీడ్ బాల్స్ తయారు చేయడంలో ఈ చిన్నారిది అందెవేసిన చేయి. అల్లనేరేడు, సీతాఫలం, చింత, పులిచింత, నేరేడు వంటి స్థానిక జాతులకు చెందిన విత్తనాలను సేకరించి, మట్టితో కలిపి ఉండలుగా చేసి అడవుల్లో విసిరేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది ఒక్కటే 10 వేల అల్లనేరేడు విత్తనాలను గంభీరావుపేట పెద్దమ్మ అడవుల్లో చల్లి తన పట్టుదల చాటుకుంది.

డ్రోన్ల సాయంతో మూడు రాష్ట్రాల్లో..
ప్రకృతిని పచ్చగా మార్చే క్రమంలో ఈ చిన్నారి ఆధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంది. మానాల, శివగలపల్లి, కొండగట్టు వంటి స్థానిక అడవులతో పాటు, డ్రోన్ల సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో కూడా విత్తన వర్షం కురిపిస్తూ పర్యావరణ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఆదర్శంగా చిన్నారి సంకల్పం
“అడవులు ఉంటేనే జీవం ఉంటుంది.. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి ప్రకృతిని కాపాడాలి” అని చిన్నారి బ్లెస్సి ఇస్తున్న పిలుపు నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోంది. ప్రభుత్వాలు, భారీ సంస్థలు చేయాల్సిన పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తన చిట్టి చేతులతోనే భుజాన వేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన పర్యావరణ ఉద్యమానికి ఈ చిన్నారి ప్రతీకగా నిలుస్తోంది. ఒక చిన్నారి సంకల్పం లక్షల చెట్లకు ప్రాణం పోస్తుంటే, ఆమె ప్రయాణం తెలంగాణ గర్వించేలా ఉందని స్థానికులు కొనియాడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.