epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారా..?

రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారా..?
రోడ్డుతో సమానంగా డివైడర్.. రాత్రివేళల్లో కనిపించని పరిస్థితి
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా అలుగునూర్ చౌరస్తా
ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర కూడలి
డివైడర్ ఎత్తు పెంచి, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్

కాకతీయ, కరీంనగర్: నగరంలోని అలుగునూర్ చౌరస్తాలో ఇటీవల నిర్మించిన కొత్త రహదారి ప్రయాణాన్ని సులభతరం చేసినప్పటికీ, అదే రహదారిపై ఉన్న పాత డివైడర్ ఇప్పుడు వాహనదారులకు మృత్యుపాశంగా మారింది. రోడ్డు ఎత్తు పెంచి వేసినప్పటికీ, డివైడర్‌ను మాత్రం అదే స్థాయిలో వదిలేయడంతో అది రోడ్డుతో సమానంగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రివేళల్లో డివైడర్ అస్సలు కనిపించక, వాహనదారులు అకస్మాత్తుగా ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. అలుగునూర్ చౌరస్తా కరీంనగర్ నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటి. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారితో పాటు సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ కూడలి మీదుగానే ప్రయాణిస్తాయి. నిత్యం వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. అయితే, డివైడర్‌కు తగిన ఎత్తు లేకపోవడం, దానికి రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్ లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు చివరి నిమిషం వరకు దానిని గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ప్రాణాలు తీసే ఉచ్చుగా మారిన రోడ్డు
రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టిన సమయంలోనే, కొత్త రహదారి ఎత్తుకు అనుగుణంగా డివైడర్‌ను పునర్నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు కొత్తగా వేయడం అభివృద్ధే కావచ్చు, కానీ భద్రతను విస్మరిస్తే అదే రోడ్డు ప్రాణాలు తీసే ఉచ్చుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, డివైడర్ ఎత్తు పెంచడంతో పాటు, రాత్రివేళల్లో కనిపించేలా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.