epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జర్నలిస్టుల సమస్యలను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాలి

  • నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఉద్య‌మాల‌ను ఉధృతం చేస్తాం
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, కటారి కృష్ణ
  • భ‌ద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన
  • కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
  • ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బీమా పథకం అమలు చేయాలని డిమాండ్
  • ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు

కాక‌తీయ‌, కొత్త‌గూడెం ప్ర‌తినిధి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తక్షణమే స్పందించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్ళబండి కృష్ణమూర్తి, కటారి కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మరియు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పోరాటాల ఫలితంగానే అక్రిడేషన్ కార్డుల మంజూరులో కొంత వెసులుబాటు కలిగిందని, ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ నిరసనకు వివిధ జర్నలిస్టు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

అసమానతలపై జర్నలిస్టుల ఆగ్రహం

టీడబ్ల్యూజేఎస్, ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి జనుమాల రమేష్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1/70 చట్టాన్ని సాకుగా చూపి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, కానీ బడా భవనాలకు మాత్రం మినహాయింపులు ఇస్తున్నారని మండిపడ్డారు. నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కరోనా సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుందని జర్నలిస్టు సంఘాల నేతలు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, జర్నలిస్టుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలో ప్రారంభించిన ఇళ్ల స్థలాల ప్రక్రియను సైతం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వనమా శ్రీనివాసరావు, అల్లాడ రమేష్, జి. మధు, జి. వేణు, కొడాలి వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.