epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వీర భైరన్‌పల్లికి కరువైన గుర్తింపు

వీర భైరన్‌పల్లికి కరువైన గుర్తింపు
త్యాగాల గడ్డపై అధికారుల నిర్లక్ష్యం
శిథిలావస్థకు చేరుకుంటున్న‌ స్మారక స్థలాలు!
హామీల‌ను అమ‌లు చేయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం
చారిత్రక వారసత్వ పరిరక్షణలో యంత్రాంగం వైఫల్యం!

కాక‌తీయ‌, మద్దూర్ : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీర భైరన్‌పల్లి పేరు చిరస్మరణీయం. నిజాం నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వెరవకుండా వీరోచితంగా పోరాడిన ఆ గ్రామం ఎందరో అమరవీరుల త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. తెలంగాణ పోరాట పటిమను గుర్తుచేసే ప్రతి సందర్భంలోనూ భైరన్‌పల్లి పేరు సగర్వంగా వినిపిస్తుంది. కానీ, ఆ చారిత్రక గ్రామాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వీర భైరన్‌పల్లి పేరు పాఠ్యపుస్తకాల్లో, చరిత్ర గ్రంథాల్లో సగర్వంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అభివృద్ధి కానరావడం లేదు. అమరవీరుల స్మారక స్థలాల సంరక్షణ, చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణ వంటి విషయాల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సందర్శకులకు అవసరమైన కనీస మౌలిక వసతులు లేకపోవడం, చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగితాలకే పరిమితమైన హామీలు
ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాన్ని సందర్శించడం, అభివృద్ధి చేస్తామని గొప్పగా హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. కానీ, ఆ హామీలు సభలతోనే ముగిసిపోతున్నాయి తప్ప, ఆచరణలో మాత్రం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గ్రామాన్ని రాష్ట్ర స్థాయి వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

సందర్శకులకు కనీస వసతులు లేవు
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, చరిత్ర పరిశోధకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు వీర భైరన్‌పల్లిని సందర్శిస్తుంటారు. అయితే, వారికి అవసరమైన తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్, లేదా పోరాట చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించే సమాచార బోర్డులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరం. చారిత్రక ప్రదేశానికి వచ్చే సందర్శకులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. వీర భైరన్‌పల్లిని రాష్ట్ర స్థాయి చారిత్రక పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని, అమరవీరుల స్మారక స్థలాలను ఆధునికీకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక మ్యూజియం, లైట్ అండ్ సౌండ్ షో, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి, ప్రతి ఏటా అధికారికంగా ‘తెలంగాణ పోరాట స్ఫూర్తి ఉత్సవాలు’ నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను కేవలం వేదికలపై స్మరించడమే కాకుండా, వారి చరిత్రను శాశ్వతంగా నిలబెట్టేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మద్దూర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.