epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాపర్ దందా వెనుక సూత్రధారులెవరూ..?

  • దొంగలు జైల్లో.. కొనుగోలుదారులు బయట..!
  • దొంగతనాలకు యువకులను ప్రేరేపించిన వారిని వ‌దిలేస్తారా..?
  • 3000 కేజీల కాపర్ ఎక్కడ..? రికవరీ మాత్రం 300 కేజీలా..?
  • సింగరేణి, బీటీపీఎస్ స్క్రాప్ కేసులో ద‌ర్యాప్తుపై అనుమానాలు
  • మ‌ణుగూరులో తీగ‌లాగితే..ఏటూరునాగారంలో క‌దులుతున్న డొంక‌
  • అస‌మ‌గ్రంగా ఏటూరునాగారం ఎస్సై మహేష్ వివరణ

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: రోజుకు కూలీ పనులు, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే యువకులను దొంగతనాల వైపు మళ్లించి, వారి చేత కాపర్ వైర్లు చోరీ చేయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్న ముఠా వెనుక అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్న ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. దొంగతనాలకు పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినా, వారి నుంచి వేల కేజీల కాపర్ కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులపై మాత్రం కఠిన చర్యలు కనిపించకపోవడంతో దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగతనం చేసినవారు జైలులో ఉండగా, దొంగ సొత్తు కొనుగోలు చేసిన వారిపై ఎందుకు అదే స్థాయిలో చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను అరెస్టు చేశారు. దర్యాప్తులో మణుగూరులోని కొందరు స్క్రాప్ వ్యాపారులతో వారి లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మణుగూరుకు చెందిన ఇనుప వ్యాపారి సర్వేష్‌తో పాటు సుందరయ్య నగర్‌కు చెందిన నబి, హుస్సేన్ అనే వ్యాపారులు దొంగిలించిన కాపర్ వైర్లను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దొంగతనాలకు పాల్పడిన యువకులపై కఠిన సెక్షన్లు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు, కొనుగోలుదారులపై మాత్రం అదే తీవ్రతతో చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

3000 కేజీల కాపర్ ఎక్కడికి వెళ్లింది..?

జైలులో ఉన్న యువకులు తమ కుటుంబ సభ్యులకు చెప్పిన వివరాల ప్రకారం సర్వేష్‌కు సుమారు 2000 కేజీలు, నబికి 500 కేజీలు, హుస్సేన్‌కు మరో 500 కేజీల కాపర్ వైర్ విక్రయించినట్లు సమాచారం. అంటే మొత్తం 3000 కేజీలకు పైగా కాపర్ ఈ ముగ్గురు వ్యాపారుల వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు రికవరీ చేసినట్లు చెబుతున్నది 300 కేజీలకు పైగా మాత్రమే. మిగిలిన కాపర్ ఎక్కడికి వెళ్లింది? దానిని స్వాధీనం చేసుకున్నారా? ఇప్పటికే విక్రయించారా? అనే ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

దొంగతనాలకు ప్రోత్సహించింది ఎవరూ..?

దొంగతనాలకు పాల్పడిన యువకులు తాము స్వచ్ఛందంగా ఈ పనులు చేయలేదని, స్క్రాప్ వ్యాపారులే కాపర్ తెస్తే కొనుగోలు చేస్తామని చెప్పడంతోనే ఈ మార్గంలోకి వెళ్లామని తమ బంధువుల వద్ద చెప్పినట్లు సమాచారం. కొందరు యువకుల ఖాతాలకు వ్యాపారుల నుంచి ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ లావాదేవీల వివరాలు పోలీసుల దర్యాప్తులో ఉన్నాయా? వాటిని స్వాధీనం చేసుకున్నారా? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. దొంగ సొత్తు కొనుగోలు చేయడం కూడా చట్టరీత్యా నేరమే అయినప్పటికీ, కొనుగోలుదారులపై అదే తీవ్రతతో చర్యలు కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్క్రాప్ దందా వెనుక పెద్ద నెట్‌వర్క్..?

ఈ వ్యవహారం కేవలం కాపర్ వైర్లకే పరిమితం కాదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సింగరేణి, బీటీపీఎస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల నుంచి వచ్చే స్క్రాప్ కొనుగోళ్లలోనూ ఇదే వ్యాపారుల పాత్ర ఉందని స్థానికంగా ప్రచారం సాగుతోంది. అక్రమంగా వచ్చిన స్క్రాప్, కాపర్, ఇతర లోహాలను కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్న నెట్‌వర్క్ పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరికొందరు మధ్యవర్తులు, ప్రభావశీలుల పాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారణ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్రమ వ్యాపారాలకు అండగా నిలిచిన వారెవరైనా ఉంటే వారినీ గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఎస్సై ఏమంటున్నారు..?

ఈ వ్యవహారంపై ఏటూరునాగారం ఎస్సై మహేష్ స్పందించారు. దొంగతనాలకు పాల్పడిన యువకులపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 2 కేసుల్లో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం 7 గురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సుమారు 300 కేజీలకు పైగా కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్లు తెలిపారు. నిందిత యువకులు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. అయితే దొంగ సొత్తు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులపై ఏయే సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.