ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసింగ్
మణుగూరు డివిజన్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి
కరకగూడెం పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు
కాకతీయ, కరకగూడెం: పోలీసు అధికారులు, సిబ్బంది నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మణుగూరు డివిజన్ డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కరకగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన స్టేషన్లోని రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణ, అవసరాలు, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని, స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని డీఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

