- ఆగస్టు 1న భారీ నిరసన ర్యాలీ నిర్వహణ
- బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకండి రాంబాబు
కాకతీయ, ఖమ్మం టౌన్: వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు జడ్పీ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకండి రాంబాబు తెలిపారు. గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెలుగుమట్లలోనే బాధితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనవడు భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. బాధితురాలు సుమలత మాట్లాడుతూ, వెలుగుమట్లలోనే ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వట్టే ఉదయ్, ఎండీ అమిత్, మట్ట నవ్య, మౌనిక, పోలూరి రాము, శివరాత్రి కృష్ణ, బుజ్జి నరసింహారావు, హసీనా, డి. రాము, వేముల కోటేశ్వరరావు, ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

