epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి సంజయ్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలని

  • యూడీఎఫ్ టెండర్లపై ఆరోపణలు నిరాధారం రవీందర్ సింగ్‌కు సునీల్‌రావు కౌంటర్
  • గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎక్సెస్ టెండర్లపై సమాధానం చెప్పాలని డిమాండ్

కాకతీయ, కరీంనగర్ : యూడీఎఫ్ (యూనిఫైడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్) టెండర్ల పేరిట కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.శుక్రవారం కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూడీఎఫ్ పథకం కింద రూ.180 కోట్లకు పరిపాలనా అనుమతి లభించినప్పటికీ, ఈసీవీ విలువ రూ.137 కోట్లేనని తెలిపారు. పనులు కూడా అదే విలువ మేరకు జరుగుతున్నాయని, అలాంటప్పుడు రూ.30 నుంచి రూ.40 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు.

టెండర్ల ఆమోదం రాష్ట్ర ప్రభుత్వానిదే

యూడీఎఫ్ టెండర్ల ప్రక్రియ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, టెండర్లకు ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వమేనని సునీల్‌రావు స్పష్టం చేశారు. అలాంటి ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపిస్తే దానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసిన రవీందర్ సింగ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత ప్రభుత్వ టెండర్లపై సమాధానం చెప్పాలి

ఎక్సెస్ టెండర్లపై మాట్లాడుతున్న రవీందర్ సింగ్ ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల గురించి సమాధానం చెప్పాలని సునీల్‌రావు ప్రశ్నించారు. గత పదేళ్లలో వేల కోట్ల రూపాయల విలువైన పనులు అదే నిర్మాణ సంస్థలకు అప్పగించారని, అప్పట్లో ఎక్సెస్ టెండర్లపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.మిడ్ మానేరు, గౌరవెల్లి, తోటపల్లి, మల్లన్నసాగర్, భక్తరామదాసు వంటి ప్రధాన ప్రాజెక్టులను కూడా ఇదే సంస్థ నిర్మించిందని గుర్తు చేశారు. ఆ పనులకు అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టులు ఇచ్చిన విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు.

స్మార్ట్‌సిటీ టెండర్లపై నిలదీత

కరీంనగర్‌లో రూ.546 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో కూడా నాలుగు శాతం ఎక్సెస్ టెండర్ ఉందని, అది ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు కూడా ఇదే సంస్థకు అప్పగించారని పేర్కొన్నారు.ఎక్సెస్ టెండర్లు అనేవి ప్రభుత్వ సాంకేతిక నిర్ణయాల్లో భాగమని, వాటిని అవినీతిగా చిత్రీకరించడం రాజకీయ దురుద్దేశమేనని విమర్శించారు.

బండి సంజయ్‌కు టెండర్లతో సంబంధం లేదు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టెండర్లు, కాంట్రాక్టుల కేటాయింపులతో ఎలాంటి సంబంధం లేదని సునీల్‌రావు స్పష్టం చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం యూసీఎఫ్ పథకం కింద రూ.840 కోట్ల నిధులు తీసుకురావడమే బండి సంజయ్ కృషికి నిదర్శనమని అన్నారు.అవసరమైతే యూడీఎఫ్ టెండర్లపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని, కానీ ఆధారాలు లేకుండా బండి సంజయ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్, పొన్నం మొండయ్యతో పాటు పార్టీ నాయకులు పండుగ నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయంగా వేడెక్కిన టెండర్ వివాదం

రూ.180 కోట్ల యూడీజీ టెండర్‌పై మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలు, వాటికి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఇచ్చిన ఘాటు కౌంటర్‌తో కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేస్తుండగా, మరోవైపు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సునీల్ రావు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యూడీజీ టెండర్ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.