epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏఐ ఎంట్రీతో బోగస్ మస్టర్ల గుట్టురట్టు అవుతుందా..?

ఏఐ ఎంట్రీతో బోగస్ మస్టర్ల గుట్టురట్టు అవుతుందా..?
ఉపాధి పనుల్లో అక్రమాలపై డిజిటల్ ఉక్కుపాదం
జియో ట్యాగ్ ఫొటోలతో కూలీల హాజరుపై నిఘా
పనులు చేయకుండానే బిల్లులు.. తప్పుడు మస్టర్లకు చెక్
తేడాలు తేలితే రికవరీతో పాటు క్రిమినల్ కేసులు

కాకతీయ, కరీంనగర్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) అమలులో ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న బోగస్ మస్టర్లు, నకిలీ హాజరు, పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపుల ఆరోపణలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధ (ఏఐ)ను రంగంలోకి దించింది. కూలీల హాజరు నుంచి పనుల పురోగతి వరకు ప్రతి అంశాన్ని ఏఐ విశ్లేషించనుండటంతో, ఇప్పటివరకు దాగి ఉన్న అక్రమాలు బయటపడతాయా? అనే చర్చ మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో నమోదై ఉన్నారు. ప్రతిరోజూ పనిస్థలాల్లో తీసే జియో ట్యాగ్ ఫొటోలను ఏఐ పరిశీలించి, హాజరు, పనుల పురోగతి, స్థల వివరాలను సరిపోల్చనుంది. ఒకే వ్యక్తి పేరు పలుచోట్ల నమోదు కావడం, పనిస్థలంలో లేకుండానే హాజరు చూపించడం, వాస్తవ పనికి మించిన బిల్లులు నమోదు చేయడం వంటి అంశాలు తేలితే వెంటనే గుర్తించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అక్రమాలకు చెక్ పడుతుందా..?

గతంలో పలు ప్రాంతాల్లో బోగస్ మస్టర్లు, పనులు పూర్తి కాకుండానే బిల్లులు, నకిలీ కొలతలపై ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఏఐ వ్యవస్థ అమలుతో అలాంటి అవకతవకలను గుర్తించడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం సాంకేతికతను ప్రవేశపెట్టడం సరిపోదని, ఏఐ గుర్తించిన లోపాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏఐ విశ్లేషణలో నకిలీ హాజరు, తప్పుడు బిల్లులు, బోగస్ చెల్లింపులు లేదా ఇతర అవకతవకలు బయటపడితే ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడంతో పాటు సంబంధిత అధికారులపై, బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అసలు పరీక్ష అమలులోనే..!

ఏఐ వ్యవస్థ ప్రవేశంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా? లేక కొత్త విధానాన్ని కూడా దాటవేసే మార్గాలను కొందరు వెతుకుతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో నమోదైన ఫిర్యాదులు, పెండింగ్ విచారణలు, రికవరీ కేసులను కూడా ఏఐ ఆధారిత విశ్లేషణతో అనుసంధానిస్తే ఉపాధి హామీ పథకంలో ఉన్న బోగస్ వ్యవస్థ పూర్తిగా బయటపడే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.