epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ

ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ
ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సీనియ‌ర్ నాయ‌కుడి వరుస భేటీలు
సీఎం రేవంత్‌, వేం నరేందర్‌రెడ్డి సానుకూల సంకేతాలు?
ఢిల్లీ పర్యటనతో ఆశావహుల్లో కొత్త చర్చ
కట్టర్‌ కాంగ్రెస్ వాదిగా పార్టీ అధిష్ఠానం వ‌ద్ద‌ గుర్తింపు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ సీనియర్‌ నేత, కట్టర్‌ కాంగ్రెస్‌ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ పేరు తాజాగా బలంగా వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుండగా, రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి సైతం అనుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రామకృష్ణ వరుసగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన రామకృష్ణ.. అనంతరం కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠాన పెద్దలను కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ కార్యకర్తగా తన సుదీర్ఘ ప్రస్థానం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేస్తున్న కార్యక్రమాలు, రామకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌యూఐలో సామాన్య కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ జీవితం దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతోందని వివరించినట్లు తెలిసింది.

కట్టర్‌ కాంగ్రెస్ వాదిగా గుర్తింపు

ఎస్సీ వర్గానికి చెందిన రామకృష్ణ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌కు విధేయంగా ఉందని, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినా స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చానని అధిష్ఠానానికి వివరించారు. బీఆర్ఎస్‌ పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. యువతలో కాంగ్రెస్‌పై పెరుగుతున్న ఆదరణను కూడా వివరించినట్లు తెలిసింది.

సీఎం వైపు నుంచి సానుకూలత?

రామకృష్ణను కట్టర్‌ కాంగ్రెస్‌ నేతగా గుర్తించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రామకృష్ణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అంశంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సీఎంకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి కూడా రామకృష్ణ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే రామకృష్ణ నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన పెద్దలను కలిశారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరిన రామకృష్ణ, ఒకవేళ ఆ అవకాశం దక్కని పక్షంలో ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని కూడా అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. పార్టీలో తన సేవలను గుర్తించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తన పేరును కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి సిఫారసు చేసిన విషయాన్ని కూడా వినతిపత్రం ద్వారా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

పోటీదారుల్లో పెరిగిన ఉత్కంఠ

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌లో పలువురు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ పేరు రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం స్థాయిలో చర్చకు రావడంతో పోటీదారుల్లో ఉత్కంఠ పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సానుకూలత, సీఎంకు సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి మద్దతు, తాజాగా ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీలు.. ఇవన్నీ రామకృష్ణ అభ్యర్థిత్వంపై చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ పేరు ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.