సీపీని కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గం
కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కలను అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు. అధ్యక్షుడిగా కె. కరుణాకర్, ఉపాధ్యక్షులుగా బి. సతీష్, బి. శరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా బి. నరేష్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి, సి.హెచ్. మహేందర్ యాదవ్, ఏ. రమేష్, ఎన్. ప్రవీణ్, ఎం.డి. తాజుద్దీన్, పి. సర్వేశ్ ఉన్నారు. నూతన కార్యవర్గానికి సీపీ అభినందనలు తెలిపి సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్య, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

